ముగ్గురు హాకీ ఆటగాళ్లుకు అర్జున పురస్కారo

- May 11, 2016 , by Maagulf
ముగ్గురు హాకీ ఆటగాళ్లుకు అర్జున పురస్కారo

 క్రీడారంగంలో ప్రతిష్ఠాత్మక పురస్కారమైన అర్జున అవార్డుకు ముగ్గురు ఆటగాళ్ల పేర్లను హాకీ ఇండియా ప్రతిపాదించింది. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రీతు రాణి, పురుషుల జట్టులో సీనియర్‌ ఆటగాడు వీఆర్‌ రఘునాథ్‌, ఆసియా క్రీడల్లో పతకం సాధించిన జట్టు సభ్యుడు ధర్మవీర్‌సింగ్‌ను అర్జున అవార్డుకు ప్రతిపాదిస్తున్నట్లు హాకీ ఇండియా జనరల్‌ సెక్రటరీ మహ్మద్‌ ముస్తాఖ్‌ అహ్మద్‌ తెలిపారు. కాగా.. మాజీ ఆటగాడు సిల్వనస్‌ దంగ్‌ దంగ్‌ను మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారానికి, ప్రముఖ కోచ్‌ సీఆర్‌ కుమార్‌ను ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించింది.ఆటలో అంకితభావం, ప్రతిభను గుర్తించి.. వీరి పేర్లను అవార్డులకు ప్రతిపాదించినట్లు అహ్మద్‌ తెలిపారు. 1980లో ఒలింపిక్‌ బంగారు పతకం సాధించిన భారత జట్టులో మాజీ ఆటగాడు దంగ్‌ దంగ్‌ ఒకరు. స్పెయిన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలవడంలో దంగ్‌ దంగ్‌ కీలక పాత్ర పోషించారు.పురుషుల హాకీ జట్టులో ఒకడైన రఘునాథ్‌ 2005లో పాకిస్థాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. అప్పటి నుంచి హాకీలో బెస్ట్‌ డ్రాగ్‌ ఫ్లికర్‌గా గుర్తింపు పొందాడు. అలాగే.. ధర్మవీర్‌ సింగ్‌.. ఒలింపిక్‌ అథ్లెట్‌గా పేరొందాడు. ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన భారత హాకీ జట్టులో ధర్మవీర్‌ ఒకడు. ఇక.. భారత మహిళల హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రీతు సింగ్‌.. ఇప్పటికే తన జట్టుతో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com