పవర్ స్టార్ హుషారు మామూలుగా లేదుగా.!
- May 18, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చాలా సజావుగా సాగుతోందనే చెప్పాలి. ఓ వైపు సినిమాలూ, మరోవైపు రాజకీయం.. ఇలా రెండింటినీ ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు.
స్టార్ హీరోల్లో ఎవ్వరూ చేయలేని దూకుడు ప్రదర్శిస్తున్నారు సినిమాల్లో. ఎంత ఫాస్ట్‌గా సినిమాలు ఓకే చేశారో.. అంతే ఫాస్ట్‌గా ఆయా సినిమాల్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు.
ఒక్క సినిమా కాదు, సమాంతరంగా రెండు మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా వున్నారు. తాజాగా ‘ఓజీ’ కోసం ముంబయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని, హైద్రాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్‌కి తనను తాను సిద్ధం చేసుకున్నారు.
ఆల్రెడీ కంప్లీట్ చేసిన ‘వినోదయసితం’ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ఈ రోజు అనగా మే 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ సినిమాకి ‘బ్రో’ అనే టైటిల్ ప్రచారంలో వుండగా, మరి కాసేపట్లో అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







