ఏపీ ప్రభుత్వంకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల షాక్
- May 18, 2023
అమరావతి: ఏపీ ప్రభుత్వంకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు షాక్ ఇచ్చాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని తీర్మానించాయి. బకాయిల విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ సేవలు నిలిపి వేస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది.
పేద రోగులకు భరోసా కల్పిస్తున్న అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకాన్ని దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఆయన ప్రారంభించిన ఈ పథకాన్ని తరువాత ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ కొనసాగుతుంది. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది పేద కుటుంబాల వారు ఉచితంగా చికిత్స పొందుతున్నారు. ఇలాంటి ఆరోగశ్రీ సేవలు రేపటి నుంచి ఏపీలో బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీ ఆసుపత్రుల అసోసియేషన్ఆ రోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకి లేఖ ద్వారా తెలియజేసింది.
బకాయిల విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈసేవలు నిలిపి వేస్తున్నట్లు ఆస్పత్రుల అసోషియేషన్ తెలిపింది. ఏపీలో ఆరోగ్యశ్రీ కింద ఏపీలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బకాయిలు రాకపోవడంతో సేవలు నిలిపివేయాలని జిల్లాల వారీగా ఏకగ్రీవ తీర్మానానికి ప్రైవేట్ ఆస్పత్రులు ఆమోదం తెలిపాయి.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









