లంచం తీసుకుంటూ.. పట్టుబడ్డ ఇద్దరు జెడ్డా జనరల్ కోర్టు ఉద్యోగులు
- May 19, 2023
జెడ్డా: ఓ కేసుకు సంబంధించి పౌరుడి నుండి లంచం అందుకున్న ఇద్దరు ఉద్యోగులను జెడ్డాలోని జనరల్ కోర్టులో అవినీతి నిరోధక అధికారులు అరెస్టు చేశారు. కోర్టులో 6వ తరగతి ఉద్యోగి అయిన అయిమన్ అబ్దుల్‌రజాక్ సల్వాతి.. ఒక పౌరుడి నుండి అక్రమంగా అప్పీల్స్ కోర్టులో కేసును ముందుకు తీసుకురావడానికి SR 500,000 లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందులో SR250,000 తీసుకుంటుండగా అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ తెలిపింది. మరో కేసులో పౌరుడికి మరియు జెడ్డాలోని ఒక పెట్టుబడి కంపెనీకి మధ్య ఉన్న కేసులో పౌరుడికి SR 7,317,000 జరిమానా విధించిన తీర్పును రద్దు చేయిస్తానని అదే కోర్టులో 9వ తరగతి ఉద్యోగి అయిన అలీ మహ్మద్ అల్డౌగి SR125,000 లను లంచంగా అందుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఇరువురు ఉద్యోగులు లంచం తీసుకుంటున్న వీడియోలను అథారిటీ విడుదల చేసింది. అవినీతికి వ్యతిరేకంగా తమ జీరో-టాలరెన్స్ విధానాన్ని వర్తింపజేస్తామని అథారిటీ మరోసారి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









