హజ్ యాత్రికులకు బాసటగా నిలిచిన సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన కువైట్ ప్రవాసాంధ్రులు
- May 19, 2023
కువైట్ సిటీ: హజ్ యాత్రికుల కు బాసటగా నిలిచిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కువైట్ లోని ప్రవాసాంధ్ర మైనారిటీల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో గల ఆర్.ఆర్ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన సమావేశములో వైఎస్ఆర్సిపీ గల్ఫ్ మరియు కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్. ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ ముస్లిం మైనారిటీ సోదరులకు బాసటగా నిలిచి 1 .813 హజ్ యాత్రికులకు ప్రతి ఒక్కరికి 83 వేలు మొత్తం 14 .51 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం హర్షణీయమని తెలుపుతూ హజ్ యాత్రికుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళ్ళి సమస్యను పరిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్.బి.అంజాద్ బాషాకి ధన్యవాదాలు తెలిపారు.
వైయస్ఆర్ సిపి కువైట్ కమిటీ మైనార్టీ నాయకులు లక్కీ అజిస్ మాట్లాడుతూ, భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదని మైనారిటీ ముస్లిం సోదరులు అందరూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
ఈ కార్యక్రమములో ప్రముఖ ప్రారిశ్రామక వేత్త కరీం చెప్పలి, హబీబ్ చెప్పలి, షేక్ రహమతుల్లా, షా హుస్సేన్, షేక్ జాఫర్, అబూ తురబ్, సజ్జాద్, ఇమ్రాన్, అబ్దుల్ అజిస్ మరియు వైయస్ఆర్ సిపి కువైట్ నాయకులు గోవిందు నాగరాజు, యం .వి. నరసారెడ్డి, నాయని మహేశ్వర్ రెడ్డి, మన్నూర్ చంద్ర శేఖర్ రెడ్డి, రమణ యాదవ్, మర్రి కళ్యాణ్, నాగిరెడ్డి చంద్రారెడ్డి, పులపుత్తూర్ సురేష్ రెడ్డి,బి.యన్.సింహ, ఆడపూర్ ప్రసాద్ , గజ్జల నరసారెడ్డి , అరవ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









