డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో 17 మందికి శిక్షలు ఖరారు
- May 19, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో హషీష్, కొకైన్‌ను అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మంది నిందితులకు హై క్రిమినల్ కోర్టు భారీ శిక్షలు విధించింది. శిక్షలు పడ్డ వారిలో ఏడుగురు యూరోపియన్ జాతీయులు, ఒక GCC వ్యక్తి, ఒక అరబ్ మహిళ, ఒక ఆసియా వ్యక్తి, ముగ్గురు బహ్రెయిన్లు ఉన్నారు. నిందితులకు ఏడాది నుంచి జీవితకాలం వరకు జైలు శిక్షలను కోర్టు విధించింది. అలాగే వారికి BD77,000 జరిమానా విధించింది. వారి జైలు శిక్షలు పూర్తయిన తర్వాత విదేశీయులు బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు బహ్రెయిన్‌లోకి అక్రమ మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడానికి, వాటిని పంపిణీ చేయడానికి క్రిమినల్ నెట్‌వర్క్‌ను ఏర్పరుచుకున్నారని, దీనికి సంబంధించి అంతర్గత మంత్రిత్వ శాఖకు సమాచారం వచ్చింది. ఒక రహస్య ఏజెంట్‌ను విచారణ కోసం కేటాయించారు. నేరస్థుడిని ఎర చేయడానికి అతను కొంత కొకైన్ కోసం BD120 చెల్లించాలని ప్రతిపాదించాడు. వారు సీఫ్‌లో కలుసుకున్న సమయంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన BD 8,000ని అతని ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విచారణించిన తర్వాత ముఠాలోని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







