పెరిగిన పసిడి ధర..

- May 11, 2016 , by Maagulf
పెరిగిన పసిడి ధర..

నగల వ్యాపారుల కొనుగోళ్లతో బంగారం ధర మళ్లీ పెరిగింది. రూ.100 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,950కి చేరింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.7శాతం పెరిగి 1,274.65 యూఎస్‌ డాలర్లకు చేరింది.అలాగే వెండి ధర సైతం పెరిగింది. రూ.500 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,100కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో దీని ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com