భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు...
- May 22, 2023
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. హైదబాబాద్, బెంగళూరు, భానూర్,విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలలో కార్యాలయాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో హెచ్ఆర్, బిజినెస్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేపట్టనున్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్,ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ,ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించరాదు.
అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 39,000 వరకు జీతం చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bdl-india.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









