‘దేవర’ కోసం జాన్వీ కపూర్ అలా కనిపిస్తుందా.?
- May 22, 2023
అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ఎన్టీయార్‌తో ‘దేవర’ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పుటి నుంచో సౌత్ ఆడియన్స్ ఎదురు చూపులకు ఇప్పటికిలా తెర పడింది జాన్వీ ఎంట్రీతో.
అంతా బాగానే వుంది. బాలీవుడ్లో ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది జాన్వీ కపూర్. కానీ, కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. అందుకు కారణం బయట ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో, అందుకు పూర్తి భిన్నంగా సినిమాల్లో కనిపిస్తుంటుంది.
ఇంతవరకూ జాన్వీ నటించిన సినిమాల్లో ఎక్కడా గ్లామర్‌కి చోటివ్వలేదు జాన్వీ కపూర్. అయితే, బాలీవుడ్లో ఆమెకి అలా చెల్లిపోయిందంతే. కానీ, టాలీవుడ్లో అది చెల్లుతుందా.?
‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ గ్లామర్ కంచెలు తెంచాల్సిందేనా.? అయితే, ఈ సినిమాలో జాన్వీ ప్రాధాన్యత వున్న పాత్రలో కనిపించనుందంటూ టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లో డీ గ్లామర్ లుక్స్‌లోనే కనిపిస్తూ కాస్త గ్లామరస్‌గా అప్పీల్ ఇస్తోంది. జరుగుతోన్న ప్రచారం ప్రకారం, జాన్వీ నుంచి కావల్సినంత గ్లామర్ అవుట్ పుట్ రాబట్టబోతున్నారంటూ టాక్ నడుస్తోంది.
నిజమో, కాదో సినిమా రిలీజ్ అయితే గానీ తెలీదు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







