మే 26న ఖతార్ లో ICBF-కార్మికుల దినోత్సవం
- May 22, 2023
దోహా: రాబోయే “లేబర్ డే రంగ్ తరంగ్ 2023” వేడుకలలో భాగంగా ఖతార్‌లో 30 సంవత్సరాలకు పైగా నివాసం ఉంటూ సేవలు అందిస్తున్న ఐదుగురు కార్మికులను సన్మానించనున్నారు. ఇందు కోసం అర్హులైన కార్మికుల వివరాలు తెలియజేయాలని ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) కోరింది. అర్హత ఉన్నవారు వివరాలు సమర్పించాలని సూచించింది. మే 26న సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆసియా టౌన్ క్రికెట్ స్టేడియం పార్కింగ్ వేదికలో ఈ వేడుకలు ఉంటాయని ICBF తెలిపింది. అర్హులైన కార్మికుల వివరాలు తెలిస్తే.. వారి పేర్లను సమర్పించమని కమ్యూనిటీ సభ్యులను కోరింది. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 22 మే 2023. దరఖాస్తులను సంప్రదింపు వివరాలతో పాటు [email protected]కు పంపవచ్చు. మరిన్ని వివరాల కోసం 66100744 లో ICBF జనరల్ సెక్రటరీ వర్కీ బోబన్ని సంప్రదించాలని ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) అధ్యక్షుడు షానవాస్ బావ తెలిపారు.
దరఖాస్తు నమూన
1. పేరు:
2. ఖతార్‌లో రెసిడెన్సీ పొడవు:
3. పని మరియు కంపెనీ/సంస్థ స్వభావం (ఫ్రీలాన్సర్లు లేరు):
4. మొబైల్ నంబర్:
5. నామినీ సంక్షిప్త వివరణ:
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









