వైట్ హౌస్ వద్ద ట్రక్కు బీభత్సం
- May 23, 2023
వాషింగ్టన్: వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ సమీపంలోని లాఫేట్ స్క్వేర్ వద్ద ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి దూసుకొచ్చిన ఓ ట్రక్కు సెక్యూరిటీ బారికేడ్లను ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్టు యూఎస్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆంథోనీ గుగ్లీల్మీ తెలిపారు.
బారికేడ్లను ట్రక్కు ఢీకొట్టిన తర్వాత ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లు, నడకదారులను మూసివేసినట్టు సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. అంతేకాదు, సమీపంలో ఉన్న హే ఆడమ్స్ హోటల్‌ను అధికారులు ఖాళీ చేయించినట్టు ‘ఫాక్స్ 5’ టెలివిజన్ న్యూస్ తెలిపింది. ట్రక్కు డోరును రిమోట్ రోబో సాయంతో తెరిచారు. అందులో అనుమానాస్పద వస్తువులు ఏవీ లేవని గుర్తించారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









