యూఏఈ లో పెరగనున్న ఉష్ణోగ్రతలు?

- May 23, 2023 , by Maagulf
యూఏఈ లో పెరగనున్న ఉష్ణోగ్రతలు?

యూఏఈ: దేశంలోని కొన్ని ప్రాంతాలలో పగటిపూట మాత్రమే పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) అంచనా వేసింది. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలలో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చునని, ఉష్ణప్రసరణ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని NCM ప్రతినిధి డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. ముఖ్యంగా దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అయితే, ఇవేవి ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పును తీసుకురాలేవన్నారు. బుధవారం, దుబాయ్- అబుధాబితో సహా వివిధ ఎమిరేట్స్‌లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. NCM కొన్ని ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. మరో వారం పాటు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com