యూఏఈ లో కార్ల వేలం: సగం ధరకే కార్లు..!

- May 23, 2023 , by Maagulf
యూఏఈ లో కార్ల వేలం: సగం ధరకే కార్లు..!

యూఏఈ: యూఏఈలో అతిపెద్ద లైవ్ కార్ వేలం లో కొనుగోలుదారులు, విక్రేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో కొందరు Dh40,000 విలువైన కార్లను Dh20,000 కే దక్కించుకున్నారు.  ఆదివారం సాయంత్రం షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 2లో మర్హబా ఆక్షన్స్ ద్వారా జరిగిన వేలంలో 2,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. లైవ్ బిడ్డింగ్ కోసం 360 ప్రీ-ఓన్డ్ కార్లను అందుబాటులో పెట్టినట్లు మర్హబా వేలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జుబైర్ రషీదీ వెల్లడించారు.  ప్రజలు మార్కెట్ ధర కంటే 30 నుండి 40 శాతం తక్కువ ధరకు కార్లను వేలంలో చాలామంది కొనుగోలు చేశారన్నారు. కార్లు కొనుగోలుచేసిన వారిలోంచి ఎంపిక చేసిన వారికి బంగారు కడ్డీలు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు  ఇతర బహుమతులను అందజేస్తామని వివరించారు. తమ వద్ద అన్ని రకాల మిక్స్‌డ్ టైప్ మోడల్‌లు, అన్ని రకాల ధరలు, లగ్జరీ, ప్రీమియం, ఎకానమీ, కార్లు, ప్రజల కోసం అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యక్తిగతంగా హాజరు కాలేని వారి కోసం, వేలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసారం చేయబడుతుందన్నారు. మర్హబా ఆక్షన్స్ అనేది కార్ వేలం హౌస్. సౌక్ అల్ హరాజ్ - షార్జా ఆటో విలేజ్, షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 2లోని రెండు ఆపరేటింగ్ శాఖల నుండి వారానికి ఆరు వేలం నిర్వహిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com