బహ్రెయిన్ జలాల్లో వ్యర్థాలు వేస్తే.. ఏడాది జైలు, BD21,000 జరిమానా
- May 24, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ పర్యావరణ పరిరక్షణ చట్టం నం. 7/2022ను ఉల్లంఘించినందుకు దిగువ క్రిమినల్ కోర్ట్ ప్రతివాదికి ఒక సంవత్సరం జైలు శిక్ష, BD21,000 జరిమానా విధించింది. అనుమానితుడు పర్యావరణపరంగా నిషేధించబడిన వ్యర్థాలను సముద్రంలో వేయడం వంటి నేరాలకు పాల్పడ్డాడని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల చీఫ్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
పశ్చిమ సరిహద్దు సముద్రంలో కాలానుగుణ తనిఖీ సందర్శనల సమయంలో నిందితులు పెద్ద మొత్తంలో కలపతో సహా పర్యావరణ నిషేధిత వ్యర్థాలను డంపింగ్ చేయడం ద్వారా సముద్ర తీరం, నీటిని కలుషితం చేసినట్లు గుర్తించామని, ఇందులో నిర్మాణ వ్యర్థాలు , నైలాన్ సంబంధిత వ్యర్థాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దీంతో నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టామని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







