అబుధాబిలో రెండు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు మూసివేత

- May 24, 2023 , by Maagulf
అబుధాబిలో రెండు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు మూసివేత

యూఏఈ: అనేక ఉల్లంఘనల కారణంగా అబుధాబిలోని రెండు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించినట్లు ఎమిరేట్స్ హెల్త్ అథారిటీ మంగళవారం ప్రకటించింది. ఈ రెండు సౌకర్యాలు భద్రతా విధానాలు, సంక్రమణ నియంత్రణ మార్గాలను అనుసరించడంలో విఫలమయ్యాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ - అబుధాబి (DoH) పేర్కొంది. వారు గడువు ముగిసిన పదార్థాలు, సాధనాలను ఉపయోగించినట్లు గుర్తించినట్లు తెలిపింది. వైద్య వ్యర్థాల తొలగింపు, రక్త యూనిట్ల నిల్వ కోసం ప్రమాణాలు, నిబంధనలను పాటించడంలో ఆయా కేంద్రాలు విఫలమైనట్లు అథారిటీ పేర్కొంది. ప్రధానంగా రోగుల ఆరోగ్యం, భద్రతను పరిరక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు DoH తెలిపింది. ఎమిరేట్‌లో పనిచేస్తున్న అన్ని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలని అథారిటీ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com