అక్కినేని హీరోలకి సమంత అవసరం పడిందా.?
- May 24, 2023అక్కినేని హీరోలకి ప్రస్తుతం ఏదీ కలిసి రావడం లేదు. అలాగే, అటు సమంతకీ పెద్దగా కలిసి రావడం లేదు. బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్‌లు చూసింది సమంత.
ఖచ్చితంగా హిట్ కొడతాడనుకున్న నాగ చైతన్య కూడా ‘కస్టడీ’తో ఫ్లాప్ ఇచ్చాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, సినిమాలతో కన్నా నాగ చైతన్య, సమంతలకు పర్సనల్ లైఫ్‌లో వున్న క్రేజే ఎక్కువ.
అది క్యాష్ చేసుకోవడానికే టాలీవుడ్లో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు తెర వెనక మంతనాలు జరుగుతున్నాయట.
ఇటు నాగార్జున కూడా అందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. చై, సామ్ విడాకుల అనంతరం ఈ న్యూస్ గుప్పుగుప్పుమంటున్నా.. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తోంది.
నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత ద్వారా ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు తోస్తున్నాడట నాగార్జున. త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..