అనసూయ ‘విమానం’ ఎగిరేందుకు సిద్ధం.!
- May 24, 2023అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించిన ‘విమానం’ సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది. తాజాగా సెన్సార్ చేసుకున్న ఈ సినిమాని జూన్ 9న రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.
‘విమానం’ అనే టైటిల్ ఈ సినిమాపై ఆసక్తి రేపుతోంది. కథా, కమామిషు ఏంటనేది తెలీదు కానీ, ఇంతవరకూ రిలీజ్ అయిన పోస్టర్లలో పలు రకాల బోల్డ్ లుక్స్‌లో కనిపిస్తోంది అనసూయ భరద్వాజ్.
ఇంచుమించు ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్రను తలపించేలా వున్నాయ్ అనసూయ లుక్స్. పాత్ర ఎలా వుండబోతోందో చూడాలి మరి.
ఇకపోతే, ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ నటుడు సముద్ర ఖని, కమెడియన్ ధనరాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ అర్జున్ ఈ ఇన్నోవేటివ్ స్టోరీని తెరకెక్కించాడు. చూడాలి మరి, ‘విమానం’ సినిమా ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?