మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- December 15, 2025
మస్కట్: హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MHT) ఒమన్ బొటానిక్ గార్డెన్ ప్రాజెక్టును మస్కట్ మునిసిపాలిటీకి అప్పగించింది.పర్యాటకం, సైన్స్, పరిశోధన మరియు వారసత్వ సంరక్షణకు పేరుగాంచిన ఒమన్ బొటానిక్ గార్డెన్ ప్రాజెక్ట్ లో అనేక రకాల స్థానిక మొక్కలు, అరుదైన చెట్లు ఉన్నాయి.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలలో అవగాహనను పెంచుతున్నారు. ప్రత్యేకమైన మొక్కల జీవవైవిధ్యాన్ని కాపాడటంలో ఈ వ్యూహాత్మక ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే,ఈ ప్రాంతంలో పర్యావరణ పర్యాటకం, పర్యావరణ విద్యకు ఇది కీలక కేంద్రగా మారుతుందని వెల్లడించారు.
ఈక్రమంలో మస్కట్ మునిసిపాలిటీ అల్ ఖౌద్ విలేజ్ రోడ్‌లో 1.4 కి.మీ డ్యూయల్ క్యారేజ్‌వేను ప్రారంభించింది.ఈ రహదారిలో ప్రతి దిశలో రెండు లేన్‌లు, పుట్ పాత్ వేలు, ఒమన్ బొటానిక్ గార్డెన్ వైపు ట్రాఫిక్ సాఫీగా సాగడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్న ఒమన్ బొటానిక్ గార్డెన్ ఈ ప్రాంతం గొప్ప వృక్షశాస్త్ర వారసత్వాన్ని ప్రతిబింబించే సహజ ఆవాసాలను కేంద్రంగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







