ప్రముఖ నటుడు చంద్రమోహన్ కు ఎన్.టీ.ఆర్ అవార్డు
- May 24, 2023
హైదరాబాద్: వంశీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహణలో విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖ నటుడు చంద్రమోహన్ కు ఎన్.టీ.ఆర్ అవార్డు, ఫిల్మ్ నగర్ లోని ఆయన స్వగృహంలో లక్ష్మీనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొని బహుకరించారు.విశ్రాంత జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... నేడు సినిమా క్రికెట్, క్రైమ్ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయని కుటుంబ వ్యవస్థ ను బలీయం చేసే చిత్రాలకు ఆదరణ లేదని లక్ష్మీ నారాయణ ఆన్నారు.కుటుంబ కధా చిత్రాలలో చంద్ర మోహన్ నటన విలక్షణ మన్నారు. ఎన్.టి.ఆర్ వంటి మహోన్నత నటుడు తెలుగు వారు కావటం జాతి అంతా గర్వించాలని అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహా రావు మాట్లాడుతూ...చంద్ర మోహన్ తో తాను 25 సినిమాలకు దర్శకత్వం వహించనని మంచి ఈజ్ ఉన్న నటుడని అభినందించారు. వంశీ రామరాజు నిర్వహించిన కార్యక్రమంలో జలందర చంద్ర మోహన్ దైవజ్ఞ శర్మ,దేశాయి, శ్రీదేవి, శైలజ, డాక్టర్ సుధ, రాశీ మూవీస్ నర సింహారావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







