ప్రైమ్ ఎనర్జీ డ్రింక్స్ వినియోగంపై పేరెంట్స్ కు హెచ్చరిక..!
- May 25, 2023
యూఏఈ: పిల్లలు ప్రైమ్ ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల కలిగే ప్రమాదాల గురించి దుబాయ్ పాఠశాల తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. GEMS వరల్డ్ అకాడెమీ ఇటీవల తల్లిదండ్రులకు ఓ సర్క్యులర్ పంపింది. ఈ పానీయాలను తీసుకోవడం వల్ల కలిగే పర్యవసనాలను అందులో వివరించారు. ఈ పానీయాలను తీసుకోవడం వల్ల ఆందోళన పెరగడం, వ్యసనంగా మారి వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని GEMS వరల్డ్ అకాడమీ (GWA)లో PR & కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సహర్ తహేరి తెలిపారు. ఈ పానీయాల అధిక వినియోగం హృదయ స్పందన రేటు, అధిక రక్తపోటు, నిద్ర భంగం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందన్నారు. GEMS వరల్డ్ అకాడమీ ప్రాంగణంలో ప్రైమ్ లేదా ఏదైనా ఇతర ఉత్పత్తులను అమ్మడంపై నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైమ్ ఎనర్జీ డ్రింక్ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు తగదని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







