లగ్జరీ జీవితాన్ని ఆస్వాదించడానికి ఉత్తమమైన ప్రదేశం దుబాయ్..!
- May 25, 2023
దుబాయ్: ధనికులు లగ్జరీ జీవితాన్ని, విజయాన్ని, సంపదను ఆస్వాదించడానికి దుబాయ్ ఉత్తమమైన ప్రదేశం అని బుగట్టి రిమాక్ సీఈఓ మేట్ రిమాక్ చెప్పారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రెంచ్ లగ్జరీ కార్‌మేకర్ మాట్లాడుతూ.. తమ అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్ (UNHWI) క్లయింట్లు చాలా మంది ఇక్కడ ఎమిరేట్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా తమ కుటుంబాలు, కార్లతో దుబాయ్‌కి తరలివస్తున్నారని తెలిపారు. "బుగట్టికి అమెరికా అతిపెద్ద సింగిల్ మార్కెట్, అయితే దుబాయ్‌లో మా కంపెనీ కార్లు చాలా ఉన్నాయి. మేము UAEలో దాదాపు 150 బుగట్టిలను కలిగి ఉన్నాము. ప్రధానంగా దుబాయ్‌లో ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.
“దుబాయ్‌కి ప్రజలను ఆకర్షిస్తున్నది భద్రత, సౌకర్యవంతమైన జీవితం, పిల్లలకు గొప్ప విద్య, ఎంచుకోవడానికి అద్భుతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు, మంచి రెస్టారెంట్లు మరియు గొప్ప షాపింగ్ గమ్యస్థానాలు. ఇక్కడ ప్రతిదీ ప్రపంచ స్థాయికి చేరుకుంది, ”అని అతను బుగట్టి రెసిడెన్సెస్ బై బింఘట్టి(అల్ట్రా-లగ్జరీ టవర్) ప్రారంభించిన సందర్భంగా వెల్లడించారు.
హెన్లీ గ్లోబల్ సిటిజన్స్ రిపోర్ట్ ప్రకారం.. 2022లో 4,000 మంది మిలియనీర్లు UAEకి వలస వచ్చారు. ఇది గత సంవత్సరం ప్రపంచంలోని మిలియనీర్లలో అత్యధిక వలసలు కావడం గమానర్హం. తాజా హెన్లీ నివేదిక దుబాయ్‌ను అత్యధిక సంఖ్యలో మిలియనీర్లు ఉన్న టాప్ 20 నగరాల్లో ఒకటిగా పేర్కొంది. ఎమిరేట్‌లో 68,400 మంది మిలియనీర్లు 1 మిలియన్ డాలర్లకు పైగా సంపదను కలిగి ఉన్నారని, 238 మంది వ్యక్తులు 100 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని , 15 మంది బిలియనీర్లు ఉన్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







