అబుధాబి హిందూ దేవాలయాన్ని సందర్శించిన 30 దేశాల రెసిడెంట్ అంబాసిడర్‌లు

- May 26, 2023 , by Maagulf
అబుధాబి హిందూ దేవాలయాన్ని సందర్శించిన 30 దేశాల రెసిడెంట్ అంబాసిడర్‌లు

అబుధాబి: యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు 30 కంటే ఎక్కువ దేశాల రెసిడెంట్ అంబాసిడర్‌లు, దౌత్య సంఘం సభ్యులు మే 25 మేన అబుధాబిలో BAPS హిందూ దేవాలయ సముదాయాన్ని సందర్శించారు. 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినప్పటి నుండి ఆలయ పురోగతిని సంజయ్ సుధీర్ వారికి వివరించారు. భారతదేశం, ఇతర దేశాల మధ్య ఉన్న సన్నిహిత, చారిత్రాత్మక మరియు సాంస్కృతిక బంధాలకు ప్రతీకగా BAPS హిందూ దేవాలయ ప్రాజెక్టు అని అభివర్ణించారు.

హిందూ మందిర్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న బ్రహ్మవిహారిదాస్ స్వామిజీ.. శాంతి, సామరస్యం, సహనం, సహజీవనం విలువలను పెంచేలా ఆలయ నిర్మాణాన్ని అద్వితీయ నిర్మించారని తిపారు. భారతీయ సాంస్కృతిక వ్యవస్థలను తెలియజేసేలా ఆలయం లోపల నిర్మించిన వాస్తు శిల్పాలను చూసి రాయబారులు ఆశ్చర్యపోయారు.  

BAPS హిందూ దేవాలయం పునాది రాయిని 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వేశారు. ఇది ఫిబ్రవరి 2024 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఆలయానికి 17 ఎకరాల భూమిని యూఏఈ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది. యూఏఈని తమ రెండవ నివాసంగా మార్చుకున్న 3.5 మిలియన్ల భారతీయులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు, భారతదేశం-యుఎఇ మధ్య స్నేహానికి చిహ్నంగా నిలిచిపోయే ఆలయ నిర్మాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com