జూన్ 22 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం
- May 26, 2023
హైదరాబాద్: ఆషాడంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూన్ 22న గోల్కండలో బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు బేగంపేటలోని హరిత ప్లాజాలో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఉత్సవాల తేదీలను ప్రకటించారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10న రంగం, 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఊరేగింపు, జూన్ 20న బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం నిర్వహిస్తారని వెల్లడించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి, హైదరాబాద్)
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం