ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూత
- May 26, 2023
హైదరాబాద్: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.సీనియర్ దర్శకుడు కె.ప్రత్యగాత్మ కుమారుడే కె.వాసు. ఆయన బాబాయి హేమాంబరధరరావు దర్శకులే. కృష్ణాజిల్లా ముదునూరుకు చెందిన ఆయన తండ్రి బాటలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి, ప్రేక్షకులను అలరించేలా పలు చిత్రాలు తెరకెక్కించారు. కె.వాసు దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం 'ఆడపిల్లల తండ్రి'. కృష్ణంరాజు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 'ప్రాణం ఖరీదు'తో ఈయనే చిరంజీవిని నటుడిగా పరిచయం చేశారు. 'కోతల రాయుడు', 'సరదా రాముడు', 'పక్కింటి అమ్మాయి', 'కలహాల కాపురం', 'అల్లుళ్ళస్తున్నారు', 'కొత్త దంపతులు', 'ఆడపిల్ల', 'పుట్టినిల్లా మెట్టినిల్లా' వంటి చిత్రాలు వాసుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. వాసు దర్శకత్వం వహించిన 'అయ్యప్పస్వామి మహత్యం', 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్ అందుకున్నాయి. 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' పాటలు అప్పటికి, ఇప్పటికీ అజరామరం. 2008లో విడుదలైన 'గజిబిజి' సినిమా తర్వాత వాసు దర్శకత్వానికి దూరమయ్యారు.
తాజా వార్తలు
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు







