కీర్తి సురేష్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా.?
- May 27, 2023
మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం ఓ ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. హీరోయిన్ సెంట్రిక్ మూవీ అది. ప్రముఖ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
తాజాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేశారు. ‘రఘు తాత’ అనే యూనిక్ టైటిల్ పెట్టారు ఈ సినిమాకి. ఈ సందర్భంగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలను కీర్తి సురేష్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది.
అలాగే, ‘హృదయాన్ని దోచుకునే విప్లవానికి సిద్ధంగా వుండండి..’ అంటూ ఓ క్యాప్షన్ కూడా వదిలింది. దాంతో, ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్ ఏం విప్లవం చేయబోతోంది.? అనే డిస్కషన్ మొదలైంది.
ఈ సినిమాతో ఖచ్చితంగా కీర్తి సురేష్ గట్టిగానే ఏదో మ్యాజిక్ చేయబోతోంది.. అని అర్ధమవుతోంది. టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందట. నిర్మాణానంతర పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా వుంది.
దీంతో పాటూ, తెలుగులో ‘భోళా శంకర్’ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







