‘వీర సవార్కర్’గా నిఖిల్.!
- May 29, 2023నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా ఓ కొత్త సినిమా రాబోతోంది. తాజాగా ఆ సినిమా టైటిల్ రివీల్ చేశారు చిత్ర యూనిట్. ‘ది ఇండియా హౌస్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాని తన కొత్త బ్యానర్ అయిన వి మెగా పిక్చర్స్‌పై రామ్ చరణ్ రూపొందిస్తుండడం విశేషం. ఇక సినిమా విషయానికి వస్తే, ఇదో స్వాతంత్ర్య వీరుడి కథ.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మాదిరి, మరుగున పడిపోయిన, దేశం మర్చిపోయిన ఓ స్వాతంత్ర్య యోధుడి గాధ. ఈ మధ్య ‘ది కశ్మీరీ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలు ఏ విధంగా ప్రజాదరణ పొందుతున్నాయో చూస్తున్నదే.
అదే మాదిరి ‘ది ఇండియా హౌస్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా నిఖిల్ కెరీర్లో ఓ సెన్సేషనల్ మూవీ అవుతుందని ఆశిస్తున్నారు.
దేశద్రోహిగా ముద్ర వేయించుకున్న వీర సవార్కర్ అనే స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో నిఖిల్ కనిపించబోతున్నాడీ సినిమాలో.
ఇప్పటికే ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’ వంటి సూపర్ హిట్లతో దూకుడు మీదున్న నిఖిల్, త్వరలో ‘స్పై’ అనే సినిమాతో రాబోతున్నాడు. తాజా మూవీ నిఖిల్ కెరీర్‌ని మరింత ఉత్సాహపరిచేదిగా అనిపిస్తోంది చూడాలి మరి.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ