‘2018’ వరదలు కాదు, వసూళ్ల సునామీ బాస్.!
- May 29, 2023అదో మలయాళ చిత్రం. ‘2018’ అనే టైటిల్‌తో రూపొందింది. 2018లో కేరళను భారీ వరదలు ముంచెత్తేసిన సంగతి తెలిసిందే. దేశ నలుమూలల నుంచీ కేరళకు సహాయ సహకారాలు అందించారు ఈ టైమ్‌లో.
ఎవరికి తోచిన రీతిలో వారు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా ముందుకొచ్చారు. అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ‘2018’. అప్పటి వరదల్లో చిక్కుకున్న నాలుగు కుటుంబాల మధ్య నడిచిన కథతో ఎంతో హృద్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
వరదల్లో చిక్కుకుని ఆఖరి గడియల్లో విలవిల్లాడుతున్న ఆయా కుటుంబాల ఎమోషన్ని క్యారీ చేస్తూనే ఆ గాధని మన కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ ఈ సినిమాలో.
ఈ టేకింగ్కి అందరూ ఫిదా అయ్యారు. మలయాళంలో అత్యంత తక్కువ బడ్జెట్ 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృస్టించింది.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. యూనిక్ సబ్జెక్ట్ కావడంతో, ఈ సినిమాకి ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. తద్వారా ఇక్కడ కూడా ‘2018’ రికార్డు వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ