గద్దర్ కి దాసరి-వంశీ జీవిత సాఫల్య పురస్కారం
- May 30, 2023
హైదరాబాద్: వంశీ ఇంటర్నేషనల్-ఇండియా వారు, 'దాసరి వంశీ జీవిత సాఫల్య పురస్కారాన్ని' ప్రజా గాయకుడు గద్దర్ కి మే 30వ తేదీన, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హాల్, ఫిలింనగర్ లో బహూకరించారు.
ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ విరాట్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు..అంతే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు, 'దాసరి వంశీ ప్రతిభ పురస్కారాలను' బహూకరించారు.
దాసరి వంశీ విశిష్ట పురస్కారాలను డి సాయిబాబు సంపాదకులు వార్త, "మా" శర్మ మేనేజింగ్ ఎడిటర్ ఆంధ్ర పత్రిక కి బహూకరించారు... అంతేకాకుండా దాసరి వంశీ ప్రతిభా పురస్కారాలు, ఎమ్ ఆర్ సి వడ్లపట్ల, నిర్మాత, తిరుమల బ్యాంక్ చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, రచయిత నటులు సంజీవి, దర్శకులు ప్రభు, రచయిత యు వినాయకరావు, సినీ చరిత్రకారుడు సంజయ్ కిషోర్, కళాదర్బార్ సంస్థ వ్యవస్థాపకులు పొత్తూరి రంగారావు, ప్రెసిడెంట్ జాతీయ కళాకారుల సంఘం, ఎల్ వి చెన్నారావు, విరాజ్ వర్మ దర్శకులు మట్టి మనిషి షార్ట్ ఫిలిమ్, సురేందర్ ఫౌండర్ కళానిలయం మరియు షార్ట్ ఫిలిమ్ కళాకారులకు బహూకరించారు.
ముఖ్యఅతిథిగా ఎమ్. మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, సుద్దాల అశోక్ తేజ, సి. కళ్యాణ్, టి. ప్రసన్నకుమార్, మరియు దైవజ్ఞ శర్మలు పాల్గొన్నారు.
సేవ చేయటమే కానీ అవార్డ్స్ తీసుకొని వంశీ రామరాజుని సత్కరించడం మా అదృష్టం అని రామ సత్యనారాయణ గారు అన్నారు.నడిచే దర్శక పాఠశాల దాసరి, భయానికి కాంప్రమైజ్ కాను అనుకునే వ్యక్తి గద్దర్ అని దైవజ్ఞ శర్మ అన్నారు.
దాసరి దర్శకత్వం వహించిన 150 చిత్రాల్లో 30 చిత్రాల్లో నటించానని ఆయన దగ్గర నటించడం ఆర్టిస్టులకు ఎంతో సులభం అని దాసరి పేరు మీద మంచి వ్యక్తులను ఎంపిక చేసి అవార్డ్స్ బహుకరించిన వంశీ రామరాజుని మురళీమోహన్ అభినందించారు.గద్దర్ రాసిన "నీ పాదం మీద పుట్టుమచ్చ" పాట విశిష్టతను సభికులకు తెలియజేశారు.ఎక్కడో గ్రామాల్లో పాడే వ్యక్తిని తీసుకొచ్చి అవార్డు ఇవ్వడం కొత్తగా ఉంది అంటూ గద్దర్ తన ఆనందం వ్యక్తం చేశారు.. తన ప్రసంగం లో ఆశువుగా ఎన్నో గీతాలు వినిపించారు.
ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ, ఆర్ నారాయణ మూర్తి, సి కళ్యాణ్, టి.ప్రసన్నకుమార్, దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆమని,సుభాష్,రాజన్ ఫల్గుల,ఎన్ శిరీష్ దాసరి చిత్రాల్లోని గీతాలు వినిపించారు.శైలజసుంకరపల్లి, సుధామయి, సుజారమణ,రమణారావు కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







