హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో 20కి పైగా కార్లు దగ్ధం
- May 30, 2023
హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మంగళవారం (మే 30) రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టింబర్ డిపో, దాని పక్కనే ఉన్న కార్ల షోరూమ్ లో మంటలు ఎగసిపడ్డాయి. తొలుత టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. డిపో పక్కనే ఉన్న పాత కార్ల షోరూమ్ కు కూడా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో 20కి పైగా కార్లు కాలిపోయాయి. అది కార్ మెన్ కార్ అనే సెకండ్ హ్యాండ్ కార్ల గ్యారేజ్ అని తెలిసింది.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. మంటలు ఆర్పుతున్న సమయంలో కార్ల గ్యారేజీలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు స్థానికులను ఖాళీ చేయించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







