రియలిస్టిక్ స్టోరీ మాస్ రాజాకి వర్కవుట్ అయ్యేనా.?
- May 31, 2023
మాస్ రాజా ప్రస్తుతం చాలా బిజీగా వున్నారు. వరుస సినిమాలను లైన్లో పెట్టి, ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. అయితే, మాస్ రాజా నుంచి వస్తున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగానే ఫెయిలవుతూ వస్తున్నాయ్.
‘ధమాకా’, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలు తప్ప అంతకు ముందూ, ఆ తర్వాత వచ్చిన ‘రావణాసుర’ సినిమాలతో సహా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నవే. ఇక, త్వరలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రాబోతున్నాడు రవితేజ.
ఈ సినిమా పైనే రవితేజ అభిమానుల ఆశలన్నీ. రియల్ లైఫ్ రాబిన్ హుడ్ స్టూవర్ట్‌పురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
చాలా వరకూ ఈ సినిమాని రియాల్టీకి దగ్గరగా వుండేలా తెరకెక్కించామని మేకర్లు చెబుతున్నారు. అయితే, రవితేజ విషయంలో ఆ రియాల్టీ వర్కవుట్ అవుతుందా.? అనేదే ఇక్కడ మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గా మారింది.
రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్‌కి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక తర్వాత రిలీజ్ చేయబోయే పోస్టర్స్ అయినా, టీజర్స్ అయినా సరే, ప్రామిసింగ్‌గా వుండేలా జాగ్రత్త పడుతున్నారట. అలాగే, ఈ సినిమాకి బడ్జెట్ కూడా ఎక్కువే అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ టైమ్‌లో బడ్జెట్ బడా అంటే, రవితేజ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలేమో.!
తాజా వార్తలు
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!









