చమురు సంక్షోభాన్ని జిసిసి అధిగమించేదెలా?
- May 12, 2016
జిసిసి దేశాలు చమురు సంక్షోభాన్ని అధిగమించవలసి ఉందని జిసిసి సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. జిసిసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ డైరెక్టర్ జనరల్ అమెర్ అల్ హజ్రి మాట్లాడుతూ, చమురు ధరల పతనం జిసిసి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. కేవలం చమురు ధరలపైనే ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల్ని అభివృద్ధి చేసుకుంటే, చమురు ధరల సంక్షోభం నుంచి జిసిసి దేశాలు బయటపడవచ్చని ఆయన చెప్పారు. చమురు ధరల పతనంతో దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందనీ, ఈ ప్రభావం కార్మిక రంగంపైనా ఎక్కువగా ఉంటోందనీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిన పక్షంలో, జిసిసి దేశాల ఆర్థిక వ్యవస్థ ఇంకా దారుణంగా ఉంటుందని ఆయన వివరించారు. సరికొత్త ఆలోచనలతో జిసిసి దేశాలు సమస్యను అధిగమించాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







