విమానాశ్రయం నుంచి తప్పించుకున్న బహిష్కృత ప్రవాసుడు..!
- June 01, 2023
కువైట్: దేశం నుండి బహిష్కరించిన ఇథియోపియన్ ప్రవాసుడు.. కువైట్ విమానాశ్రయానికి చేరుకుని, భద్రతా తనిఖీ నుండి తప్పించుకుని దేశంలోకి ప్రవేశించాడు. అతని కోసం అధికారులు వెతుకుతున్నారు. అధికారుల నివేదిక ప్రకారం.. అతను కువైట్ చేరుకున్న తర్వాత, అతను పాస్‌పోర్ట్ కౌంటర్‌కు వెళ్లాడు. అక్కడ అతను గతంలో బహిష్కరించబడ్డాడని మరియు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించబడ్డాడని వేలిముద్ర విశ్లేషణ ద్వారా వెల్లడైంది. ఫలితంగా, అతను విమానాశ్రయ పరిశోధన బృందానికి అప్పగించారు. అతను తిరిగి వెళ్లే విమానంలో పంపించేందుకు వీలుగా విమానాశ్రయ హోటల్‌కు తరలించారు. అయితే ఆ తర్వాత అతను భద్రతా సిబ్బంది కళ్లుకప్పి అక్కడి నుంచి తప్పించుకుని దేశంలోకి ప్రవేశించాడు. అతను తప్పించుకున్న పరిస్థితులను గుర్తించేందుకు అధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







