ఖతార్ లో కార్మికుల పనివేళల్లో మార్పులు

- June 01, 2023 , by Maagulf
ఖతార్ లో కార్మికుల పనివేళల్లో మార్పులు

దోహా: వేసవిలో కార్మికులను రక్షించడానికి ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ పగటిపూట బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 1  నుండి సెప్టెంబర్ 15 వరకు.. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బహిరంగ పనిని నిషేధించనున్నట్లు పేర్కొంది. వేసవిలో వేడి ఒత్తిడి ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు సంబంధించి 2021 మంత్రివర్గ తీర్మానం నం. 17 ప్రకారం నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ఉదయం 10 గంటల తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల వరకు బహిరంగ బహిరంగ కార్యాలయాల్లో.. తగిన వెంటిలేషన్ లేని నీడ ఉన్న ప్రదేశాలలో చేసే పనిని నిషేధిస్తుందని మంత్రత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com