వరుణ్ తేజ్ పెళ్లంట.! ఈ సారి ముహూర్తం కూడా ఫిక్స్.!
- June 01, 2023మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు చూసేస్తున్నాయ్ సోషల్ మ్యాట్రిమోనీగా చెప్పబడే సోషల్ మీడియా బ్రోకర్లు. ఆ క్రమంలోనే అమ్మాయిని కూడా చూసి పెట్టేశారు ఎప్పుడో.
ఆమె ఎవరో కాదు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. గత కొంత కాలంగా లావణ్యతో వరుణ్ తేజ్ ప్రేమాయణం.. అంటూ వార్తలు వినిపిస్తూనే వున్నాయ్. ఇదిగో పెళ్లంట.! అదిగో సహజీవనమట.! అంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయ్.
ఈ ప్రేమ వార్తలకు చెక్ పెట్టే న్యూస్ తాజాగా చక్కర్లు కొడుతోంది. అదే వరుణ్ - లావణ్యల పెళ్లి న్యూస్. ఇరు కుటుంబాల వారూ వీరి ప్రేమను అంగీకరించారనీ పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్సయ్యిందనీ తాజా గాసిప్ సారాంశం.
జూన్ 9న వరుణ్ తేజ్‌కి లావణ్యతో ఎంగేజ్మెంట్ జరగనుందట. త్వరలోనే పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేయబోతున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి, ఈ సారైనా ఈ పెళ్లి గాసిప్ నిజమవుతుందా.? లేదో.?
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు