హ్యాట్సాఫ్ నాని.! మంచి నిర్ణయమే.!
- June 01, 2023
నేచురల్ స్టార్ నాని మంచి నిర్ణయం తీసుకున్నాడు. ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు ఇటీవల నాని. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాని రూపొందించారు. కానీ, తెలుగులోనే రిలీజ్ చేశారు. మంచి విజయం అందుకుంది.
అనుకున్న స్థాయి కన్నా మంచి వసూళ్లు రాబట్టింది ‘దసరా’. అయితే, ఈ స్థాయి విజయం అందుకున్నాకా నానిలాంటి హీరోలు తదుపరి ప్రాజెక్టుల కోసం భారీ బడ్జెట్ డిమాండ్ చేయడం పరిపాటే.
కానీ, నాని మాత్రం తదుపరి సినిమాల కోసం భారీ బడ్జెట్ ఎంతమాత్రమూ డిమాండ్ చేయడం లేదట. నాని ప్రస్తుతం తన 30 వ సినిమా షూటింగ్‌తో బిజీగా వున్నాడు.
ఈ సినిమాని వీలైనంత ఎర్లీగా తక్కువ బడ్జెట్‌తో పూర్తి చేసేయాలని అంటున్నాడట. ‘దసరా’ విషయంలోనే నాని ఇదే నిర్ణయంపై వున్నప్పటికీ అప్పుడు ఇతరత్రా కారణాలతో అది కుదరలేదు. కానీ, ‘నాని 30’ కోసం మాత్రం అలాంటి తప్పులేమీ జరగకుండా జాగ్రత్త పడుతున్నాడట. తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో రూపొందుతోన్న నాని 30 ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







