హ్యాట్సాఫ్ నాని.! మంచి నిర్ణయమే.!
- June 01, 2023నేచురల్ స్టార్ నాని మంచి నిర్ణయం తీసుకున్నాడు. ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు ఇటీవల నాని. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాని రూపొందించారు. కానీ, తెలుగులోనే రిలీజ్ చేశారు. మంచి విజయం అందుకుంది.
అనుకున్న స్థాయి కన్నా మంచి వసూళ్లు రాబట్టింది ‘దసరా’. అయితే, ఈ స్థాయి విజయం అందుకున్నాకా నానిలాంటి హీరోలు తదుపరి ప్రాజెక్టుల కోసం భారీ బడ్జెట్ డిమాండ్ చేయడం పరిపాటే.
కానీ, నాని మాత్రం తదుపరి సినిమాల కోసం భారీ బడ్జెట్ ఎంతమాత్రమూ డిమాండ్ చేయడం లేదట. నాని ప్రస్తుతం తన 30 వ సినిమా షూటింగ్‌తో బిజీగా వున్నాడు.
ఈ సినిమాని వీలైనంత ఎర్లీగా తక్కువ బడ్జెట్‌తో పూర్తి చేసేయాలని అంటున్నాడట. ‘దసరా’ విషయంలోనే నాని ఇదే నిర్ణయంపై వున్నప్పటికీ అప్పుడు ఇతరత్రా కారణాలతో అది కుదరలేదు. కానీ, ‘నాని 30’ కోసం మాత్రం అలాంటి తప్పులేమీ జరగకుండా జాగ్రత్త పడుతున్నాడట. తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో రూపొందుతోన్న నాని 30 ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!