‘వ్యూహం’ మూవీలోని వైఎస్ జగన్, భారతి పాత్రల స్టిల్స్ విడుదల
- June 01, 2023
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలు పై ఒక సినిమా తియ్యబోతున్నట్లు, దానిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసందే. ఇక మొదటి భాగానికి ‘వ్యూహం’, రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్స్ ని ఖరారు చేశాడు. ఇక ఈ మూవీ అనౌన్స్మెంట్ తోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లో కూడా సంచలనం సృష్టించాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ట్విట్టర్ లో సెట్స్ లోని ఫోటోలను షేర్ చేశాడు.
ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ , వైఎస్ భారతి క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నారు అనేది తెలియజేశాడు. అంతకుముందు వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ లో జగన్ పాత్రని చేసిన అజ్మల్ అమీర్ ఈ మూవీలో కూడా జగన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ నటించబోతుంది. ఇక మూవీలోని వీరిద్దరి లుక్స్ చుసిన ఆడియన్స్.. కరెక్ట్ గా సెట్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి వ్యూహం షూటింగ్ మొదలు పెట్టేసిన వర్మ ఆ చిత్రాన్ని ఎప్పుడు తీసుకు రాబోతున్నాడో చూడాలి. కాగా గత ఎన్నికల ముందు కూడా RGV చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాలను తీసుకు వస్తుండడంతో ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి గతంలో తనతో వంగవీటి సినిమా తర్కెక్కించిన దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







