అప్పుడే ఆ వుద్దేశ్యం లేదంటోన్న మాధవీ లత.!
- June 01, 2023
సెలబ్రిటీల పర్సనల్ విషయాలంటే ఎప్పుడూ సినీ జనాల్లో ఆసక్తి ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి విషయాలపై మరింత ఆత్రుత వుంటుంది. ఏ చిన్న అవకాశం చిక్కినా పెళ్లెప్పుడు.? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయ్ సెలబ్రిటీలకి.
తాజాగా ‘నచ్చావులే’ ముద్దుగుమ్మ మాధవీ లతకీ ఈ తరహా ప్రశ్న ఈ మధ్య తరచూ ఎదురవుతోందట. అందుకే కాస్త గుస్సా అయ్యింది. మళ్లీ మళ్లీ అలాంటి ప్రశ్న తన వద్దకు రాకుండా సమాధానమిచ్చింది.
అమ్మాయిల విషయంలో పెళ్లంటే అదో అపురూపమైన ఘట్టం. అందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధపడి వుండాలి. కానీ, తాను ప్రస్తుతం అందుకు సిద్ధంగా లేనని చెప్పుకొచ్చింది.
అన్ని రకాలా పెళ్లికి తాను సిద్ధంగా వున్నప్పుడు ఆ గుడ్ న్యూస్ ఖచ్చితంగా అందరికీ షేర్ చేస్తానని చెప్పింది.
ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కన్నా, ఎక్కువగా రాజకీయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. సోషల్ మీడియాలో పలు రాజకీయ అంశాల నేపథ్యంలో తనదైన స్టైల్‌లో స్పందిస్తూ వుంటుంది. తాజాగా పెళ్లి విషయంలో మాధవీ లత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







