ఫైర్‌ డ్రిల్‌ కోసం దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ టన్నెల్‌ మూసివేత

- May 12, 2016 , by Maagulf


రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) క్రైసిస్‌ మేఏజ్‌మెంట్‌ టీమ్‌, ఎయిర్‌పోర్ట్‌ టన్నెల్‌లో మాక్‌ ఫైర్‌ డ్రిల్‌ నిర్వహించనుంది. ఈ కారణంగా టన్నెల్‌ని మూసివేయనున్నారు తాత్కాలికంగా. టన్నెల్‌లో పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం మరో వాహనాన్ని ఢీ కొడుతుందనీ, ఈ సిట్యుయేషన్‌ని డీల్‌ చేయడానికి క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ ఎలా పనిచేస్తుందనేది మాక్‌ డ్రిల్‌ ద్వారా పరిశీలిస్తామని అధికారులు వెల్లడించారు. ఉదయం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫైర్‌ డ్రిల్‌ 6 గంటల వరకు జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు సంబంధించిన కొన్ని సంస్థలు కూడా డ్రిల్‌లో పాల్గొంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సమర్థవంతంగా స్పందించడం ద్వారా నష్టాన్ని నివారించేందుకు ఈ డ్రిల్‌ ఉపయోగపడ్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. నేషనల్‌ ఎమర్జన్సీ, క్రైసిస్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, ఎమర్జన్సీ, క్రైసిస్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌, దుబాయ్‌ పోలీస్‌, దుబాయ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అంబులెన్స్‌ సర్వీసెస్‌, దుబాయ్‌ మునిసిపాలిటీ, దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ - వాటర్‌ అథారిటీ, దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ, దుబాయ్‌ సివిల్‌ యావియేషన్‌ అథారిటీ, ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌, దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఈ డ్రిల్‌లో పాల్గొంటున్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com