సైబర్ ఫ్రాడ్ గురించి హెచ్చరించిన అబుధాబి పోలీసులు
- June 02, 2023
యూఏఈ: మోసపూరిత కాల్లు, మోసపూరిత వెబ్సైట్లు, వాటి లింక్‌ల పట్ల జాగ్రత్తగా వ్యవహారించాలని అబుధాబి పోలీసులు ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు మెసేజ్ లు, కాల్స్, నకిలీ వెబ్సైట్ లింక్‌ల ద్వారా మోసపూరిత ప్రకటనలు, సేవలు పేరుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తారని, అనంతరం బ్యాంకు అకౌంట్ల వివరాలను తస్కరిస్తారని అబుధాబి పోలీసులు సూచించారు. బ్యాంక్ ఖాతా లేదా బ్యాంక్ కార్డ్ సమాచారం, ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, ATM పిన్లు, కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (CVV) నంబర్ లేదా పాస్‌వర్డ్‌లతో సహా తమ రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని అబుధాబి పోలీసులు ప్రజలను హెచ్చరించారు. బ్యాంక్ ఖతాల వివరాలను బ్యాంక్ ఉద్యోగులు అడగరని, వివరాలను అప్డేడ్ చేసుకోవాలని సూచించారని పోలీసులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలకు గురైన బాధితులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రిపోర్ట్ చేయాలని, అమన్ సెక్యూరిటీ సర్వీస్ నంబర్ 8002626ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







