వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించిన సిఎం జగన్
- June 02, 2023
అమరావతి: సిఎం జగన్ నేడు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 2,562 ట్రాక్టర్లను, 100 కంబైన్ హార్వెస్టర్లను పంపిణీ చేశారు. వీటి విలువ రూ. 361.29 కోట్లు. వీటితో పాటు 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా పంపిణీ చేశారు. రైతుల గ్రూప్ ఖాతాల్లో రూ. 125.48 కోట్ల సబ్సిడీని జమ చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకే యంత్ర పనిముట్లు అందిస్తున్నామని తెలిపారు. ఆర్బీకేల్లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఉన్నాయని చెప్పారు. యంత్రాల కోసం ప్రతి ఆర్బీకే సెంటర్ కి రూ. 15 లక్షలు కేటాయించామని తెలిపారు. రైతులకు ఏం కావాలో వారినే అడిగి ఆర్బీఐ సెంటర్లలో అందిస్తామని చెప్పారు. అక్టోబర్ లో 7 లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలను అందిస్తామని తెలిపారు. రైతులందరికీ మంచి జరగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







