పసిడి ధర గురువారం స్వల్పంగా తగ్గింది

- May 12, 2016 , by Maagulf
పసిడి ధర గురువారం స్వల్పంగా తగ్గింది

పసిడి ధర గురువారం స్వల్పంగా తగ్గింది. రూ.100 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,850కి చేరింది. స్టాకిస్టులు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.41శాతం తగ్గి 1,271.50 యూఎస్‌ డాలర్లకు చేరింది. అలాగే వెండి ధర స్థిరంగా ఉంది. బుధవారం నాటి ధర వద్దే గురువారం స్థిరపడి రూ.41,100 వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు నెమ్మదించడంతో దీని ధర యధాతథంగా కొనసాగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com