దుబాయ్ లో 26 ఏళ్ల భారతీయ కార్మికుడొకరికి జైలు శిక్ష
- June 22, 2015
మహిళల వాష్ రూములోకి తొంగిచూసిన నేరంలో దుబాయ్ లో 26 ఏళ్ల భారతీయ కార్మికుడొకరికి జైలు పాలయ్యాడు. నేరం రుజువు కావడవంతో నిందితుడికి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన తర్వాత తమ దేశం విడిచి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఓ మసీదులోని మహిళల వాష్ రూములోకి తొంగిచూస్తూ పట్టుబడడంతో అతడపై కేసు నమోదైంది. గోడ వెనుకవైపున ఉన్న చిన్న గదిలో నుంచి వాష్ రూములోని తమను గమనిస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని 'ఖలీల్ టైమ్స్' తెలిపింది. మొదటి తప్పుగా పరిగణించి మూడు నెలల జైలు శిక్ష విధించినట్టు కోర్టు పేర్కొంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







