సెప్టెంబర్ వరకు స్కెంజెన్ వీసా అపాయింట్మెంట్లు లేవు..!
- June 03, 2023
యూఏఈ: స్కెంజెన్ వీసా అపాయింట్మెంట్లను కోరుతున్న యూఏఈ నివాసితులు డిమాండ్ పెరుగుదల కారణంగా సెప్టెంబర్ వరకు వేచి ఉండాల్సి ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ప్రతిరోజూ 700 వరకు కాల్స్ వస్తున్నాయని, వీసా ప్రాసెసింగ్ సమయం తగ్గించబడినప్పటికీ, స్లాట్లు పూర్తిగా బుక్ అయినట్లు పేర్కొన్నారు. అనేక మంది యూఏఈ నివాసితులు ఇప్పుడు ఈద్ అల్ అదా విరామం కోసం తమ విదేశీ సెలవులను ఖరారు చేసుకుంటున్నారని గలాదరి బ్రదర్స్ ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్‌లో MICE, సెలవుల మేనేజర్ మీర్ వాసిం రాజా తెలిపారు.
ప్రీమియం వీసా సేవలు కూడా Dh400 అదనంగా చెల్లించడం ద్వారా ఎంచుకోవచ్చని, కానీ ఆ సేవలు కూడా ఇప్పుడు అందుబాటులో లేవని రీగల్ టూర్స్ వరల్డ్‌వైడ్‌లో ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ కార్యకలాపాల సీనియర్ మేనేజర్ సుబైర్ తెకెపురాత్వలప్పిల్ తెలిపారు. అపాయింట్‌మెంట్‌కి రెట్టింపు డబ్బు చెల్లించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా.. కానీ అది తమ చేతుల్లో లేదన్నారు. వివిధ జాతీయతలకు చెందిన నివాసితులు స్కెంజెన్ దేశాలకు వెళ్లాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న వారిలో చాలామంది వీసాలు పొందగలిగారు. చాలా మంది సంవత్సరం ప్రారంభంలో జనవరి నుండి ఫిబ్రవరి వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీసా జారీ చేసిన తర్వాత ఒక ప్రయాణికుడు అతను/ఆమె వీసా కోసం దరఖాస్తు చేసుకున్న దేశంలోకి ప్రవేశించడానికి ఆరు నెలల వ్యవధి ఇవ్వబడుతుంది.
యూరప్‌లోని స్కెంజెన్ ప్రాంతం చాలా కాలంగా యూఏఈ నుండి వచ్చే పర్యాటకులకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రత్యేక వీసాల కోసం దరఖాస్తు చేయకుండానే అనేక దేశాలను సందర్శించడానికి వీలు కల్పిస్తుంది. "వేసవి కాలం సమీపిస్తున్నందున, ఈద్ అల్ అధా విరామంతో పాటు నివాసితులు ప్రయాణించడానికి ఆసక్తిగా ఉన్నారు." అని సుబైర్ చెప్పారు. "ప్రయాణం చేయాలనే కోరిక, ప్రయాణ పరిమితులను క్రమంగా ఎత్తివేయడం, కోటా లేదా వీసాల స్లాట్లలో తగ్గింపు మరియు సెలవులు కూడా GCC నివాసితులలో ఆసక్తిని పెంచుతున్నాయి." అని పేర్కొన్నారు. వీసా పొందిన నివాసితులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఏజెంట్లు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







