ఫ్రెంచ్ కేఫ్‌లో నివాసితులతో దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ సందడి
- June 04, 2023యూఏఈ: దుబాయ్ పాలకుడు గత కొన్ని రోజులుగా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం ఎమిరేట్‌లోని దుబాయ్ హిల్స్ మాల్లో సందడి చేశారు. వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి అయిన హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రసిద్ధ ఫ్రెంచ్ కేఫ్ లాడూరీలోకి వెళ్లి సందడి చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవల మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్‌లో సందడి చేసిన విధంగానే దుబాయ్ రూలర్ క్యాజువల్‌గా ఫ్రెంచ్ కేఫ్‌లోకి అడుగుపెట్టి, సాధారణ కస్టమర్ వలె టేబుల్లో కూర్చున్నారు. దీంతో అక్కడి సిబ్బంది, కొందరు నివాసితులు ఆశ్చర్యపోయారు. షేక్ మహ్మద్ ఈ వీడియోను షేర్ చేసిన యూఏఈ మహిళ.. ప్రియమైన నాయకుడిని దగ్గరగా చూడగలిగిన తర్వాత తా అదృష్ట అమ్మాయిగా భావించానని తన సోషల్ మీడియా అకౌంట్లో చెప్పారు. సదరు వీడియోలోదుబాయ్ పాలకుడు నవ్వుతూ, ఉత్సాహంగా ఉన్న ఒక చిన్న అమ్మాయితో మాట్లాడుతున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..