అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- June 05, 2023

యూఏఈ: అజ్మాన్ లోని అల్ జుర్ఫ్ పారిశ్రామిక ప్రాంతంలో ఇంధన ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతులను ఆసియన్లుగా గుర్తించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పేలుడు సంభవించినట్లు తమకు సమాచారం అందిందని అజ్మాన్ పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని అజ్మాన్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి వెల్లడించారు. కార్మికులు ట్యాంకుల్లో ఒకదానిపై వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి పేలుడుకు దారితీసింది. భద్రతా నిబంధనలను పాటించకపోవడం వల్లే పేలుడు సంభవించిందని అజ్మాన్ పోలీస్ చీఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







