బిఆర్‌ఎస్‌ సెంటర్‌కి శంకుస్థాపన చేసిన సిఎం కెసిఆర్‌

- June 05, 2023 , by Maagulf
బిఆర్‌ఎస్‌ సెంటర్‌కి శంకుస్థాపన చేసిన సిఎం కెసిఆర్‌

హైదరాబాద్: కోకాపేటలో భారత్ భవన్ కు సిఎం కెసిఆర్‌ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్‌ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.

కోకాపేటలో మొత్తం 11 ఎకరాల్లో మొత్తం 15 అంతస్తుల్లో భవనం నిర్మిస్తున్నారు. కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు,శిక్షణా తరగతులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని తక్కువ ధరకు బిఆర్ఎస్ కు కేటాయిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేవలంలో ఐదు రోజుల్లో నే భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కోకాపేటలో గజం లక్ష రూపాయలకు పైగా పలుకుతుండగా కేవలం రూ. 7500 లకు గజం చొప్పున 11 ఎకరాలను ప్రభుత్వం కట్టబెట్టింది. వందల కోట్ల స్థలాన్ని కేవలం 40 కోట్లకే కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com