మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.! స్వీటీకి ఇది చాలదు ఇంకా చాలా కావాలి.!

- June 05, 2023 , by Maagulf
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.! స్వీటీకి ఇది చాలదు ఇంకా చాలా కావాలి.!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్క ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు. ఫిజిక్ బ్యాడ్ అయిపోవడం వల్లే ఆమె సినిమాలకు దూరంగా వుంటోందన్న ప్రచారం వుంది.

అయితే, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు.

అనుష్క ఓ ఛెఫ్‌గా నటించబోతోంది ఈ సినిమాలో. అంతా బాగానే వుంది కానీ, చాలా కాలం తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో అనుష్క ఎలా వుండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ వుంది.

ఫస్ట్ లుక్స్‌తో పాటూ, ఫస్ట్ సింగిల్ అంటూ ఓ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే, అనుష్క నుంచి వస్తున్న సినిమా అంటే, ప్రమోషన్లు ఏ రేంజ్‌లో వుండాలి. అంతగా హైప్ క్రియేట్ అయ్యేలా ఈ సినిమా ప్రమోషన్లు లేవని అనుష్క అభిమానుల అభిప్రాయం. స్వయంగా అనుష్కే బరిలోకి దిగి ప్రమోషన్లను వేగవంతం చేయాలి. అప్పుడే సినిమాకి అసలు సిసలు బజ్ క్రియేట్ అయ్యేది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com