ఆర్థిక మోసాలపై ‘నాట్ నార్మల్‌’ క్యాంపెయిన్

- June 05, 2023 , by Maagulf
ఆర్థిక మోసాలపై ‘నాట్ నార్మల్‌’ క్యాంపెయిన్

రియాద్:  సౌదీ బ్యాంక్స్ మీడియా అండ్ అవేర్‌నెస్ కమిటీ ఆర్థిక మోసాలపై ‘నాట్ నార్మల్‌’ పేరుతో కొత్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వినూత్న మోసపూరిత పద్ధతుల గురించి అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా ఫేక్ బ్యాంక్ కాల్స్, అనామక కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.   బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని,  నకిలీ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా మరియు ఫిషింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడతారని వివరిస్తుంది. సోషల్ మీడియా సైట్‌ల ద్వారా వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దన్నారు. అజ్ఞాత వ్యక్తులు తమ బ్యాంక్ వివరాలను అడిగే అనామక కాల్‌లకు సమాధానం ఇవ్వవద్దని, జాగ్రత్తగా ఉండాలని కమిటీ ప్రజలను హెచ్చరించింది. నకిలీ ప్రకటనలు, అనుమానాస్పద సందేశాలు,  అతిశయోక్తి ఆఫర్‌ల వంటి మోసపూరిత మూలాధారాలకు కూడా ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా తమ బ్యాంక్ కార్డుల పాస్‌వర్డ్‌లను ఇతరులకు చెప్పవద్దని కమిటీ పేర్కొంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌ల విశ్వసనీయతను పరిశీలించాలని, సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా అవసరం అని కమిటీ పేర్కొంది. తమ బ్యాంకు కార్డుల పాస్‌వర్డ్‌ను కాలానుగుణంగా మార్చుకోవాలని పౌరులను కమిటీ కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com