మస్కట్‌లో పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం
- June 07, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో సుమారు 3,000 బ్యాగుల నమిలే పొగాకును స్వాధీనం చేసుకున్నారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA)లోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చూయింగ్ పొగాకు తయారీ, అమ్మకం కోసం ముడి పదార్థాలుగా వినియోగిస్తున్న దాదాపు 3,000 బ్యాగుల పొగాకును స్వాధీనం చేసుకున్నారు. ఖురయ్యత్‌లో ఈ పొగాకు తయారీ, వ్యాపారం నిర్వహిస్తున్న ఒక ప్రవాస కార్మికుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఖురయ్యాత్ విలాయత్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో పొగాకును రవాణా చేయడానికి ఉపయోగించే స్థలం గురించి నోటిఫికేషన్‌ను అందుకుందని, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటిఫికేషన్ సైట్‌కు వెళ్లారని అధికారులు వెల్లడించారు. పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు నటించి.. ప్రవాస కార్మికుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు తెలిపారు. విచారణలో కార్మికుడు మరొక ప్రవాస కార్మికుడి నుండి ముడి పదార్థాలను కొనుగోలు చేసిన తర్వాత పొగ లేని నమిలే పొగాకు తయారీ మరియు వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నాడు. వినియోగదారుల రక్షణ చట్టం, రిజల్యూషన్ నెం. (256/2015) కేసు నమోదు చేసారు. రిజల్యూషన్ నెం. (301/2016) ద్వారా సవరించబడిన నిబంధన ప్రకారం నమిలే పొగాకు (పొగ లేనిది )పై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







